శృంగార సంకీర్తన
రేకు: 1976-4
సంపుటము: 29-394
రేకు: 1976-4
సంపుటము: 29-394
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఇటువంటి వాఁడవుత యెఱఁగమమ్మా నేము నటియించి మన్ననలు నాకు నిచ్చీ నితఁడు | ॥పల్లవి॥ |
| యింత బత్తే కలిగితే నింటికి రావలెఁగాక సంత వలపులు మీఁదఁ జల్ల నేఁటికే వింతవారెల్లాఁజాడఁగా విడె మియ్య వచ్చీని కాంతనైతినే నన్నుఁ గాకు సేతు రటవే | ॥యిటు॥ |
| మిక్కిలి చుట్టమైతేను మేలమాడవలెఁగాక మిక్కుటపు నవ్వు నవ్వి మీర నేఁటికి పక్కనఁ గొలువులోన పయ్యదకొంగువట్టీని చక్కనిదాననైతేనే చండి సేతు రటవే | ॥యిటు॥ |
| కూడ వేడుకైతేను గుట్టు సేయవలెఁగాక యెడనైనాఁ జెనకీని యిది యేఁటికే వేడుకతో నన్నేలి శ్రీవేంకటేశుఁడు చొక్కీని యీడైనదాననైతేనే ఇంత సేతు రటవే | ॥యిటు॥ |


