Display:
శృంగార సంకీర్తన
రేకు: 1976-5
సంపుటము: 29-395
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
మెచ్చి మెచ్చి పొగడుటే మిక్కిలి నేరుపుగాక
పచ్చిదేర నాడనేల పలుమరు నిన్నును
॥పల్లవి॥
వొట్టులు నేఁ బెట్టితేను వొడివట్టి పెనఁగేవు
గుట్టున నూరకుండితేఁ గొసరేవు
తట్టి చేత నొడ్డుకొంటే తగిలి వేఁడుకొనేవు
యెట్టు గెలువఁగవచ్చు నిటువంటి నిన్నును
॥మెచ్చి॥
సిగ్గుతోడఁ గొంకితేను సేసలు పైఁ జల్లేవు
అగ్గమై సొలసితేను ఆదరించేవు
వొగ్గి నన్నుఁగూడితివి వొద్దికై శ్రీవేంకటేశ
యెగ్గు లెట్టు లెంచవచ్చు నిటువంటి నిన్నును
॥మెచ్చి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము