శృంగార సంకీర్తన
రేకు: 1976-6
సంపుటము: 29-396
రేకు: 1976-6
సంపుటము: 29-396
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ముందు ముందుగాఁ బతికి మొక్కితి ననరే మీరు మందలించి తన మేలు మరచేనా నేను | ॥పల్లవి॥ |
| చల్లఁగానే మాఁటలాడి చవులెల్లా బుట్టించి పెల్లున నన్నిటా వలపించెఁగా తాను యెల్లవారిలోనా నిఁక నెట్టు నన్ను మన్నించినా చెల్లుబడిగానే సంతోసించుకొనే నేను | ॥మందు॥ |
| పువ్వులనే నన్ను వేసి బుజ్జగించి సన్నసేసి రివ్వనఁ జుట్టరికము రేఁచెఁగా తాను రవ్వగాఁ దన నా పొందు రతికెక్కిన వెనక నవ్వుతా నొక్క మనసుననే వుండే నేను | ॥ముందు॥ |
| గుట్టున నుంకువ వెట్టి కూరిములు చల్లి చల్లి అట్టె నన్నుఁ గాఁగిటఁ బెండ్లాడెఁగాను తాను పట్టపు దేవిఁగా నిట్టె పాలించె శ్రీవేంకటేశుఁ డెట్టు నన్నుఁ భాలించినా నియ్యకొనే నేను | ॥ముందు॥ |


