శృంగార సంకీర్తన
రేకు: 1977-1
సంపుటము: 29-397
రేకు: 1977-1
సంపుటము: 29-397
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఊరకె జంకించెనంటా నుప్పతించేవు గారవపుదాని కెంత గడిఇంచేవయ్యా | ॥పల్లవి॥ |
| చెప్పిన నీ మాఁటలెల్లాఁ జెవు లాలకించి వినె కొప్పు వట్టి తీసితే మక్కువ జేకొని కప్పుర విడె మిచ్చితే గక్కనఁ దా నందుకొనె యిప్పు డింతకెంటెఁ జెలి యేమి సేసునయ్యా | ॥ఊర॥ |
| పేరుకొని పిలిచిరతే ప్రియముతో నూఁకొనె సారె నీవు నవ్వితేను సమ్మతించెను చేరి నీవు చెనకితే చెతులెత్తి నీకు మొక్కె యీరీతి దా నింతకంటె నేమ సేసునయ్యా | ॥ఊర॥ |
| చెక్కు నీవు నొక్కితేను చెంగలించి వొడఁబడె గక్కనఁ గాఁగిలించితే కరఁగె మతి చక్కని శ్రీవేంకటేశ సతినిట్టె యేలితివి యెక్కువాయ నింతకంటె నేమి సేతునయ్యా | ॥ఊర॥ |


