శృంగార సంకీర్తన
రేకు: 1977-2
సంపుటము: 29-398
రేకు: 1977-2
సంపుటము: 29-398
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| తనంతనే వచ్చె మేలు తరవులు వెట్టనేల తనిసి తనిసి లోలోఁ దలఁచుకొంటఁగాక | ॥పల్లవి॥ |
| చనవిచ్చి యాతఁడు నాసంగడి నుండఁగాను మనపు లేమి చెప్పీనే మాఁటిమాఁటికి ననుఁ జూచి యాతఁడు నవ్వులు నవ్వఁగాను వినయముతో నింకా వేఁడుకొనవలెనా | ॥తనం॥ |
| సరసములాడి నా చనుగుబ్బ లంటఁగాను మరిగించుకొనేలే మాఁపు దాఁకాను వరుస దప్పక నాపై వలపులు చల్లఁగాను తరితీపు సేసి యెట్టి తమి రేఁచేవే | ॥తనం॥ |
| కైవసమై నన్ను నిట్టె కాఁగిలించుకొనఁగాను వావు లేమి చెప్పీనే వంటు వెట్టుక శ్రీవేంకటేశుఁ డిట్టె చిత్తగించి నన్ను నేలె వేవేలకు నాడుకొన వేడుకాయఁగదవే | ॥తనం॥ |


