శృంగార సంకీర్తన
రేకు: 1977-4
సంపుటము: 29-400
రేకు: 1977-4
సంపుటము: 29-400
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| చెలియ నా విన్నపము చిత్తానఁ బెట్టుమను తెలిపేనంటే నంత దిట్టఁగాను నేను | ॥పల్లవి॥ |
| ఆసపడ్డ ముద్దరాల నలయించవద్దను సేసవెట్టి మరి రట్టు సేయకుమను పాసి పోక మొక్కఁగాను పరాకు సేయకుమను రాసి కెక్కె నా వలపు రక్షించుమను | ॥చెలి॥ |
| కాఁపురము సేయఁగాను కాకుసేయదగదను చేపట్టి వదలరాదు చెప్పితినను యేపొద్దూ నేమొక్కఁగాను యెరవు గాకుండుమను నా పసలన్నీ నెరుఁగు నన్ను నేలుకొమ్మను | ॥చెలి॥ |
| నే నలమేలుమంగను నెపాలు చప్పకుమను పూని నాతో నవ్వె నిఁకఁ బోకుమను తాను శ్రీవేంకటేశుఁడు తగులైతి నుండుమను తానక మాయ పొందు తలపోసుకొమ్మను | ॥చెలి॥ |


