శృంగార సంకీర్తన
రేకు: 1978-4
సంపుటము: 29-406
రేకు: 1978-4
సంపుటము: 29-406
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| నీ కెంత వేడుకోకాని నిండిన కొలువులోన యీ కడఁ జూచినవారి కెల్లిదమై తోఁచును | ॥పల్లవి॥ |
| వులివచ్చి నవ్వులతో నోరి యని పిలిచీని అలివేణి వావి నీ కేమౌనోకాని చెలరేఁగి రమ్మనుచు చేయివట్టి తీసీని సులభాన నెటువంటి చుట్టమోకాని | ॥నీ కెంత॥ |
| యిక్కువలంటి నీతోనే యేకాంతము లాడీని మిక్కిలి నీకెంత నమ్మినదోకాని పక్కనే నీ కుడిబడి పనులెల్లాఁ జెప్పీని గక్కక నిన్నెంత యేలుకొన్నదోకాని | ॥నీ కెంత॥ |
| మన్ననతో నలమేలుమంగవతె నురమెక్కీ తిన్నఁగా నెంత పట్టపుదేవులోకాని అన్నిటా శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి తన్ను నేలుమనీ నెట్టి తుగలుదోకాని | ॥నీ కెంత॥ |


