శృంగార సంకీర్తన
రేకు: 1978-5
సంపుటము: 29-407
రేకు: 1978-5
సంపుటము: 29-407
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సింధురామక్రియ
| పట్టెఁడెసి చన్నుల పాయపుదానవు యెట్టు వేసాలు సేసేవే యిందరుఁ జూఁడగాను | ॥పల్లవి॥ |
| చెక్కిటి చేతితోడ సిగ్గులు వడేవేమే అక్కరతో నాతఁడు మాఁటాడఁగాను గుక్కుకొంటా వలపులు గుబ్బతిలే వది యేమే చక్కెర మోవి చూపి సన్న సేయఁగాను | ॥పట్టెఁ॥ |
| సెలవుల నవ్వుకొంటా శిరసు వంచేవేమే అలరి యాతఁడు చన్నులంటఁగాను వులికి తీగెలు సాగ నూఁకొనే వది యేమే పిలిచి యాతఁడు నిన్నుఁబేరుకొనఁగాను | ॥పట్టెఁ॥ |
| వెరగంది ముక్కుమీఁద వేలువెట్టే వది యేమే తెరవేసు కాతఁడు నీ దిక్కు చూడఁగా సరి నలమేలుమంగపు సాదించే వది యేమే యిరవై శ్రీవేంకటేశుఁ డీతఁడు గూడఁగాను | ॥పట్టెఁ॥ |


