శృంగార సంకీర్తన
రేకు: 1980-1
సంపుటము: 29-415
రేకు: 1980-1
సంపుటము: 29-415
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
| ఇట తరవాతి పనులెల్లా నీ చేతివి యెటువలె మన్నించినా నితవే నాకు | ॥పల్లవి॥ |
| వేవేలుగా గొసరితి విన్నపము సేసితి నీ వేమి సేసినా మేలే నీ చిత్తము వావులెల్లాఁ దెలిపితి వాడికల మెలఁగితి భావించి నీ యాలనౌటే పదివేలు నాకును | ॥ఇట॥ |
| చేతులెత్తి మొక్కితి చిత్తము గరఁగించితి నీ తలఁపెట్టున్నా మేలే నీ చిత్తము కాతరాన వలచితి కన్నుల నిన్నుఁ జూచితి ఆతుమలో నీ వుండుటే అన్ని యీవులు నాకు | ॥ఇట॥ |
| కాఁపురాలు సేసితి కంకణము గట్టుకొంటి నీ పొందు లన్నియు మేలే నీ చిత్తము యేపున శ్రీవేంకటేశ యిట్టె నన్ను నేలితివి కాపాడేటి నీ కరుణ ఘన సంపద నాకు | ॥ఇట॥ |


