శృంగార సంకీర్తన
రేకు: 1980-5
సంపుటము: 29-419
రేకు: 1980-5
సంపుటము: 29-419
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేశాక్షి
| ఇంతులాల చూడరే యీకె బాగులు వింత వింత సింగారాల వినోదించీ నిపుడు | ॥పల్లవి॥ |
| వెలఁది నవ్వులనే వెన్నెలలు గాసీని తొలుతనే మొగము చంద్రుఁడు గనక వలపుల చెమటల వానలు గురిసీని మెలుపునఁ దురమే మేఘము గనక | ॥ఇంతు॥ |
| కొనచూపుల దూరనఁ గోలలుగాఁబొంచి యేసీ నును బొమ్మలే సింగిణులు గనక తన మాఁటలను తియ్యఁదనములు వెదచల్లీ నినుపుఁగెమ్మోవి తేనియపెర గనక | ॥ఇంతు॥ |
| వడిఁ గళల బదారు వన్నెలతో మెరసీని అడరి తానే కనకాంగి కనక గుడిగొని పెద్ద చనుఁగొండలతో చెలరేఁగీ యెడయక శ్రీవేంకటేశు దీవి గనక | ॥ఇంతు॥ |


