Display:
శృంగార సంకీర్తన
రేకు: 1981-6
సంపుటము: 29-426
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
వేగిరించనేఁటికే వెలఁది నీవు
జాగులేక వొరిచితే సతమయ్యీ నతఁడే
॥పల్లవి॥
విచ్చి చెప్పఁబోతేను వీడెమే కారముగాదా
యెచ్చి యాతనిపై నేరాలేల యెంచేవే
తచ్చితేను పెరుగులో తానే వెన్నవొడమదా
కుచ్చి కాఁగిలించుకుంటే గునిమయ్యీ నతఁడే
॥వేగి॥
కనుఁగొని సోదించితే కంటిలో నలుపుగాదా
తనివోక పతినేమి తప్పువట్టేవే
పనిగొంటే చెరకునఁ బంచదార వుట్టదా
ననిచి నవ్వితేను నయమయ్యీ నతఁడె
॥వేగి॥
భావించితే మోవిలోనె పచ్చితేనె వుండదా
శ్రీవేంకటేశ్వరు నేల సిగ్గు రేఁచేవే
కావలెనని దాఁచితే కాయలే పండ్లు గావా
వావిరి యిట్టే గూడితే వసమయ్యీ నతఁడే
॥వేగి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము