శృంగార సంకీర్తన
రేకు: 1983-1
సంపుటము: 29-433
రేకు: 1983-1
సంపుటము: 29-433
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| చెప్పవయ్యా ఇంకా నీ పె చేఁతలు వినేఁగాని ఇప్పుడు నీవద్దనున్న దెవ్వతెయ్యా యీపె | ॥పల్లవి॥ |
| వేడుకతో నల్ల నాఁడు వీదివెంట నీవు రాఁగా ఆడరాని మాఁటాడిన ఆపెవో యీపె జాడతోడ నీతోను సరి వెనఁగుకొంటాను వోడక నిన్నుఁ జన్నుల నొత్తినాపె యీపె | ॥చెప్ప॥ |
| గుట్టున నెవ్వతెతోనో కోరి నీవు మాఁటాడఁగా అట్టె కొంగువట్టి తీసినాపె యీపె పొట్టఁబొరుగుననే నీ బుజాన రేకలు దీసి రట్టు సేసినట్టు జగరాఁగా యీపె | ॥చెప్ప॥ |
| సేసవెట్టి పెండ్లాడిన చెలుచెల్లా నుండఁగాను ఆసలు మీకు రేఁచిన ఆపె యీపె రాసికెక్క శ్రీవేంకటరమణ నన్నేలితివి వాసితో నిన్నుఁ జెనకేవాడికాపె యీపె | ॥చెప్ప॥ |


