శృంగార సంకీర్తన
రేకు: 1983-3
సంపుటము: 29-435
రేకు: 1983-3
సంపుటము: 29-435
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఊరకున్నాపెను నీవే వొక్కక్కటే రేఁచితివి గారవపు టీపెవల్లఁ గడమ లే దెందును | ॥పల్లవి॥ |
| కిలకిల నవ్వఁగాఁబో కెరవి నీ జవరాలు కెలసి బొమ్మల జంకించె నిన్నును బలిమిఁ జెనకఁగాఁబో పక్కనఁ దప్పించుకొని సొలసి నిట్ట చూపులఁ జూచె నిన్నును | ॥ఊర॥ |
| పంతము లాడఁగఁబో పచ్చిదేర చెవిలోన మంతనాన నొట్టువెట్టి మాఁటలాడెను పొంత జన్ను లంటఁగాఁబో పొంచి కొప్పువట్టి తీసి కొంత గొంతములు వాఁడిగోర నూఁదె నిన్నును | ॥ఊర॥ |
| మోవి తెనెడుగఁగాఁబో మొక్కలాన బైకొని కావరాన నీ మోవి గంటిసేసెను యీవేళ శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి కైవశమై వుండఁగాఁబో కడు మెచ్చె నిన్నును | ॥ఊర॥ |


