శృంగార సంకీర్తన
రేకు: 1984-1
సంపుటము: 29-439
రేకు: 1984-1
సంపుటము: 29-439
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| మీ కిద్దరికిఁ దగవు మేము చెప్పేవారమా చేకొన్న మీ వూడిగము చెలులము నేము | ॥పల్లవి॥ |
| యింతులు పైకొంటేను యియ్యకొనవలెఁగాని యెంతైనాఁ బెనఁగరాదు యెప్పుడూ నీకు పంతము లాడుకొంటేను పై పై నవ్వవలెఁగాని వంతులకు మారుకొనవచ్చునా నీకు | ॥మీకి॥ |
| చనవున్నఁ గొసరితే సమ్మతించవలెఁగాని వెనక ముం దెంచరాదు వింతగా నీకు చెనకి కాఁగిలించితే చెలరేఁగవలెగాని మనసు సోదించరాదు మలసి నీకు | ॥మీకి॥ |
| మొక్కితేను పొందుసేసి మొగమోడవలెగాని వెక్కసించరాదు మరి వేరే నీకు ఇక్కడ శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి చొక్కి వినోదించవలె సొంపుతో నీకు | ॥మీకి॥ |


