శృంగార సంకీర్తన
రేకు: 1984-4
సంపుటము: 29-442
రేకు: 1984-4
సంపుటము: 29-442
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| చూడఁగదరే యీతని సుద్దులు వో చెలులాల వాడలోన నివీఁ గొన్ని వట్టివేసాలు | ॥పల్లవి॥ |
| వెంగెము లాడితినా వెస దనదిక్కు చూచి చెంగి చెంగి తా నేల సిగ్గువడీనే అంగడిఁ బెట్టితినా ఆరడిఁ దన చేఁతలు యెంగిలి మోవి మూసుక యేల నవ్వీనే | ॥చూడఁ॥ |
| తప్పక చూచితినా తన మేని గురుతులు అప్పుడే పచ్చడ మెంత కప్పుకొనీనే తప్పులువట్టితినా తా నాడినమాటఁలు చొప్పులుగాఁ దా నిదేమి వొట్టువెట్టొకనీనే | ॥చూడఁ॥ |
| గోరికొన నూఁదితినా కొడిమలెల్లా గట్టి చేరి వేఁడుకొని యాల చెక్కు నొక్కనే యీరీతి శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె తారుకాణించి నా కెన్ని తగవులు చెప్పీనే | ॥చూడ॥ |


