శృంగార సంకీర్తన
రేకు: 1984-6
సంపుటము: 29-444
రేకు: 1984-6
సంపుటము: 29-444
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| బత్తిగల జవరాల పాయపు పెండ్లికూఁతుర చిత్తమురా బతిసేవ సేయఁగదే యిఁకను | ॥పల్లవి॥ |
| యెడయక విభుఁడు నీ యింటి కిదె వచ్చినాఁడు నిడువాలుఁ జూపులను నివాళియ్యవే బడి నీతనిఁ గూడి పండుగ దినము నేఁడు గుడిగొన్న నవ్వుల ముగ్గులు వెట్టవే | ॥బత్తి॥ |
| సొలవక నీకు దన చుట్టరికమెల్లాఁ జెప్పి వెలయ నీ మోవితేనె విందువెట్టవే పొలుపైన తలపోఁత పొంతనాలు నొనగూడె పలుకుల కప్పురాల బాగాలు వెట్టవే | ॥బత్తి॥ |
| మంతనపుఁ గాఁగిటికి మంచి లగినము వచ్చె బంతిఁ బులకల శాస పైఁజల్లవే యింతలో శ్రీవేంకటేశుఁ డిన్నింటాను నిన్ను నేలె వింత వింత రతులను వీడు దోళ్ళాడవే | ॥బత్తి॥ |


