శృంగార సంకీర్తన
రేకు: 1985-6
సంపుటము: 29-450
రేకు: 1985-6
సంపుటము: 29-450
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| మగనితో నేమిటికే మందెమేళాలు నగుతా నుండితేనే ననుపౌఁగాక | ॥పల్లవి॥ |
| చనుఁగవ నొరసేవు సంగడిఁ గూచుండుకొంటా మొనగోరు మోపేవు మొక్కేనంటాను పెనఁగులాడ వచ్చేవు ప్రియములు చెప్పుతానే యెనలేని నీ బిరుదు లేల చూపేనే | ॥మగ॥ |
| తమలము చిందేవు తగిలి మాఁటాడుతానే చెమటలు చిమ్మేవు చెనకుతానే తమకము రేఁచేవు తగఁ బాదాలొత్తుతావే అమరునే నీ చేఁతలు అన్నియును గంటిమి | ॥మగ॥ |
| యెంగిలి సేసేవు మోవి యేకతము లాడుతానే కొంగువట్టే వప్పటిని కొసరుతానే అంగవించి శ్రీవేంకటాధిపుడు నిన్నుఁ గూడె కంగులేని నీ వలపు కానవచ్చె నిపుడు | ॥మగ॥ |


