శృంగార సంకీర్తన
రేకు: 1986-6
సంపుటము: 29-456
రేకు: 1986-6
సంపుటము: 29-456
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| ఎన్ని లేవు నీ సుద్దులు యెంచఁ బనిలేదుగాక పన్నుక యిన్నిటాఁ జెల్లుబడైనవేకావా | ॥పల్లవి॥ |
| అంటే నీ మాఁటలకు నడ్డమాడరాదుగాక నంటున గుంచె దానితో నవ్వవా నీవు దంటతనమున నీపై దప్పువేయరాదుగాక యింటికాడఁ గాళాంజాపె కియ్యవా విడెము | ॥ఎన్ని॥ |
| సారె సారె నీ చేఁతలు చక్కఁబెట్టరాదుగాక చేరి యాల వట్ట మాపెఁ జెక్కు నొక్కవా తారుకాణ సేసి నిన్నుఁ దడవఁగరాదుగాక కోరి యడపముదానిఁ గొనగోర నూఁదవా | ॥ఎన్ని॥ |
| వేడుకతో నిన్ను వెల్లవిరి సేయరాదుగాక వాడికఁ గట్టి కాపెను వలపించవా యీడనె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు వూడిగాలవారినెల్లా వొక్కొకవేళంటవా | ॥ఎన్ని॥ |


