శృంగార సంకీర్తన
రేకు: 1987-3
సంపుటము: 29-459
రేకు: 1987-3
సంపుటము: 29-459
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| గుట్టు సేసి దాఁచరాదు గురిసేసి చూపరాదు ఇట్టిది నా యాందోళము యింతి యేమి సేతునే | ॥పల్లవి॥ |
| మచ్చిక కొండవంటిది మనసు మెయిలువంటిది హెచ్చీ నిదే తుమకము లేమి సేతునే ముచ్చట చెప్పీనంటే ముంచుకొనీ సిగ్గులు పచ్చిదేరీ నుడిగితే భావ మేమిసేతునే | ॥గుట్టు॥ |
| చెలిమి తీగెవంటిది చింత వనమువంటిది యెలఇంచీఁ గోరికలు యేమిసేతునే తలఁచుకొంటే సెలవిఁ దతిగొనీ నవ్వులు చెలరేఁగీ వేడుకలు చెలి యేమిసేతునే | ॥గుట్టు॥ |
| పాయము పువ్వువంటిది భావము పండువంటిది యేయెడ చూచినా దామే యేమిసేతునే పాయక శ్రీవేంకటాద్రిపతి నన్ను నేలినాఁడు పాయమెల్లాఁ బులకించీ కాంత యేమిసేతునే | ॥గుట్టు॥ |


