Display:
శృంగార సంకీర్తన
రేకు: 1987-5
సంపుటము: 29-461
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
తప్పు లెంచ నే నిన్నుఁ దరుణీ
యిప్పుడే చెప్పితిఁ జుమ్మీ యింతిరో నీకు
॥పల్లవి॥
గంద మిచ్చి రావే చెలి కాంతునికి
నింద లేమి వచ్చునో నే నోపనమ్మా
అందియ్యవే విడెము నీ వాతనికి, నీ పతి
చెంది తమ్మ వెట్టితే నేమందువో నీవు
॥తప్పు॥
కమ్మి వేళ చూచి రావే కలికీ
నెమ్మి నాతో నవ్వు నేమో నే నోపనమ్మా
రమ్మని పిలువవే దూరక చేయివట్టి
అమ్మరో మేను సోఁకు నేమందువో నీవు
॥తప్పు॥
ఆముక యెదురుకోవే అదె వచ్చీని
నీమారు న న్నంటునేమో నే నోపనమ్మా
దోమటి శ్రీవేంకటేశుతోఁ గూడి రావే
ఆమఱఁగున నుండి యేమందువో నీవు
॥తప్పు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము