శృంగార సంకీర్తన
రేకు: 1988-1
సంపుటము: 29-463
రేకు: 1988-1
సంపుటము: 29-463
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| లాలించి కూడఁగరాదా లలన కడుఁ గోమలి పాలించితి విఁక నేల పచ్చిసేసేవు | ॥పల్లవి॥ |
| వెన్నెలబాయట నాపె విన్నపాలు సేయఁగానే చన్నులేట టిసికేవు సారె సారెకు కన్నుల జంకించి యట్టె కాళ్లకు మొక్కరాఁగానే నున్నఁగా మాఁటిడి మొలనూ లేల పట్టేవు | ॥లాలిం॥ |
| చేవల్లకు వచ్చి యాపె చేరి విడె మియ్యఁగానే మోవి యేల యానేవు ముందుగా నీవు పూవులను వేసి నిన్ను పూఁచి చెక్కు నొక్కఁగానే కావరించుకొంటా నేల కాఁగినించేవు | ॥లాలిం॥ |
| జమళిఁ గూడి నీ కాపె సరిఁ గత చెప్పఁగానే తమలము వెట్టి యంత తమి రేఁచేవు ఆమర శ్రీవేంకటేశ యలమేల్మంగ ననఁగా సమరతి నింతయేల సాము సేసేవు | ॥లాలిం॥ |


