శృంగార సంకీర్తన
రేకు: 1988-4
సంపుటము: 29-466
రేకు: 1988-4
సంపుటము: 29-466
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| నా మాఁటలోనివాఁడవు నమ్మినదానను నేను చే ముంచి నా సేవలెల్లాఁ జిత్తగించవయ్యా | ॥పల్లవి॥ |
| చుట్టపు వరుస నిన్ను సొలసితి నింతేకాక యెట్టు సేసినా నేరా లెంచేనా నేను నెట్టుకొన్న వలపుల నీ దిక్కు చూచితిఁగాక చుట్టి నీ మై గురుతులు సోదించేనా | ॥నామాఁట॥ |
| మంచితనమున నీ మర్మము లంటితిఁగాక చంచుల నిన్నుఁ జెనకి సాదించేనా కొంచక సంతోసాన గొబ్బున నవ్వితిఁగాక నించి యెగసక్కేలెల్లా నీయందుఁ జేసేనా | ॥నామాఁట॥ |
| చెలిమికతైనై నీ చెరఁగు వట్టితిఁగాక బలుములు సేసి నీతోఁ బచారించేనా యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను మలసి నన్నేలితివి మాఁట మీరేనా | ॥నామాఁట॥ |


