Display:
శృంగార సంకీర్తన
రేకు: 1989-3
సంపుటము: 29-471
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఎంత భాగ్యవంతుఁడవో యిన్నియును నొనగూడె
మంతనాన నీకె నిట్టె మన్నించవయ్యా
॥పల్లవి॥
చెలిమి చేటఁడు చల్లె చెలియ నీమీఁదను
కలికితనాలు నీకు గంపలఁ బెట్టె
వలపులు నీ యెదుట వాములుగాఁ గూడ పెట్టె
యెలమి నీ కోరికె లేడేరెనయ్యా
॥ఎంత॥
నగవులు మూఁట గట్టె నలినాక్షి నిన్నుఁ జూచి
పగట్టుఁ జేఁతులు నీకు బండ్లఁ బెట్టె
మొగమిచ్చ లెల్లా నీ ముందరి దొంతి వేరిచె
తగులాయములు నీకు దలకూడెనయ్యా
॥ఎంత॥
వాపులు గాదెఁ బోసె వనిత నీ పొందుసేసె
మోవి సన్నలు నీమాఁద మోపు గట్టెను
యీవేళ శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
దేవులాయ నీ వేడుక తిరమాయనయ్యా
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము