శృంగార సంకీర్తన
రేకు: 1989-5
సంపుటము: 29-473
రేకు: 1989-5
సంపుటము: 29-473
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| ఇన్నింటికి సెలవుగా నిదిగో నీకు మొక్కేను మన్నించి నాపై కరుణ మఱవకువయ్యా | ॥పల్లవి॥ |
| కలికితనాల నిన్ను కడుఁగడుఁ గొసరితి కలకల నవ్వి నవ్వి కరఁగించితి మొలక చన్నుల నొత్తి మొగమోడించితి నిన్ను యెలమి నా వుద్దండాలు యెన్నిలేవయ్యా | ॥ఇన్ని॥ |
| సారెకు వలపు చల్లి చనవు సాదించితి కూరిమిగొసరి నిన్ను గుంపించితి పేరుకొని నా యెంగిలి పెద్దవులఁ బిలిచితి యీరీతి నా తమకము యేమి చెప్పీనయ్యా | ॥ఇన్ని॥ |
| చక్కదనములు చూచి సరసము లాడితి పెక్కులాగుల రతులఁ బెనఁగితి యిక్కువలంటి శ్రీవేంకటేశ నన్ను నేలితివి యిక్కడ నా కోరికలు యీడేరెనయ్యా | ॥ఇన్ని॥ |


