శృంగార సంకీర్తన
రేకు: 1990-4
సంపుటము: 29-478
రేకు: 1990-4
సంపుటము: 29-478
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఎంచితే నొకటి కొక టెక్కుడాయ సింగారము మించిన యీపె వొరపు మిక్కిలి సింగారము | ॥పల్లవి॥ |
| చెలివదనమునకు చిరునవ్వు సింగారము పలువరుసకు ముద్దుఁబలుకు సింగారము కలికి కన్నులకు చింక చూపులు సింగారము నిలువు దారుమునకు నెరులు సింగారము | ॥ఎంచి॥ |
| గరిమ మొగమునకు కళలు సింగారము వురమునకు చన్నుల వుద్దుటు సింగారము సరుస బొమ్మలకును జంకెనలు సింగారము సిరి దొలఁకు మేనికి సిగ్గులు సింగారము | ॥ఎంచి॥ |
| పెనుఁ బిరుఁదుకు మురిపెములు సింగారము వొనరిన వేతులకు వొయ్యారాలు సింగారము ననిచి శ్రీవేంకటేశునకు నీకు దేవులాయ పెనగొన్నరతు లివి పెండ్లి సింగారము | ॥ఎంచి॥ |


