శృంగార సంకీర్తన
రేకు: 1991-1
సంపుటము: 29-481
రేకు: 1991-1
సంపుటము: 29-481
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| అల్లవాఁడె గద్దెమీఁద నంగనలు గొలవఁగా వుల్లాసముతో నవ్వీని ఉద్దగిరి కృష్ణుఁడు | ॥పల్లవి॥ |
| పచ్చఁబట్టు దట్టివాఁడు బాలకృష్ణుఁడు పచ్చి దేరే పెదవుల బాలకృష్ణుఁడు బచ్చన చక్రముచేతి బాలకృష్ణుఁడు పచ్చారి వలపులనే బాలకృష్ణుఁడు | ॥అల్ల॥ |
| బలురోలఁ గట్టువడె బాలకృష్ణుఁడు బలిమి మద్దుల దోసె బాలకృష్ణుఁడు పలు గోపికలఁ గూడె బాలకృష్ణుఁడు బలరాము తమ్ముఁడు బాలకృష్ణుఁడు | ॥అల్ల॥ |
| పట్టినాఁడు వెన్నముద్ద బాలకృష్ణుఁడు పట్టుఁగొమ్ము సురలకు బాలకృష్ణుఁడు బట్ట బయట మెరసే బాలకృష్ణుఁడు పట్టపు శ్రీవేంకటాద్రి బాలకృష్ణుఁడు | ॥అల్ల॥ |


