శృంగార సంకీర్తన
రేకు: 1991-4
సంపుటము: 29-484
రేకు: 1991-4
సంపుటము: 29-484
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఎన్నఁడూ నెరఁగము ఇటువంటి కొత్తలు ఇన్నిటా నీ కీపె పొందు లెట్లబ్బెనయ్య | ॥పల్లవి॥ |
| కరఁగి కరఁగి సారె కాంత నీతో మాఁటలాడీ యెరవో సతమో యీకె యెవ్వతెయ్యా కెరలి కెరలి లోలో కిల కిల నవ్వు నవ్వీ తెరలోని కెందుండి తెచ్చుకొంటివయ్యా | ॥ఎన్నఁ॥ |
| తగిలి తగిలి నీకుఁ దమకము రేఁచీని చిగురో చేఁగో యీపెఁ జెప్పవయ్యా మొగమెత్తి మొగమెత్తి మోవి నీకుఁ జూపీని సొగిసి నీ కెన్నాళ్ల చుట్టరికమయ్యా | ॥ఎన్నఁ॥ |
| వీడె మిచ్చి వీడె మిచ్చి వేఁడుకొనీ జెక్కు నొక్కి వేడుకో వాడికో యీపె విధ మేదయ్యా యీడనే శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి వాడలో నీ వీకె నెట్లా వలపించితివయ్యా | ॥ఎన్నఁ॥ |


