శృంగార సంకీర్తన
రేకు: 1991-6
సంపుటము: 29-486
రేకు: 1991-6
సంపుటము: 29-486
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| చుట్టపు వరుస నన్నీ సుదతి సింగారమాయ దట్టమై యొకటి కొకటి దాపులాయఁ గదవే | ॥పల్లవి॥ |
| తొలుతనే సతి మోవి దొండపండై యుండఁగాను పలుకుఁ జిలుక లందు పరఁగుఁగదే తళుకుఁ గన్నులు మంచి తామరలై వుండఁగాను అలరు నెరిఁ దుమ్మిద లమరుఁగదే | ॥చుట్ట॥ |
| సరసనే నెమ్మోము చెందురుఁడై వుండఁగాను గరిమ నవ్వు వెన్నెలఁ గాయు గదవే గురు కుచుములు పెద్దకొండలై వుండఁగాను సిరుల నడు మనేటి సింహము చేరుగదే | ॥చుట్ట॥ |
| కడలేని యీకె మేను కనకమై వుండఁగాను వుడివోని మించు వన్నె లుండుఁగదవే జడియక పిరుఁ దిది చక్రమై వుండఁగాను బడి శ్రీవేంకటేశుఁడు పట్టుకండుఁగదవే | ॥చుట్ట॥ |


