శృంగార సంకీర్తన
రేకు: 1992-3
సంపుటము: 29-489
రేకు: 1992-3
సంపుటము: 29-489
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| ఎదుటనే వుండఁగాను యెడమాఁట లేమిటికే కదిసి పెనఁగులాడే కలయికలే మేలే | ॥పల్లవి॥ |
| మచ్చికలు నెరపితే మనసు లేకము లౌను ఇచ్చకము తెచ్చితేనే యింపులు వుట్టు ముచ్చటలు గలసితే ముదురు నడియాసలు మెచ్చులుగా బతితోడి మేలములే మేలే | ॥ఎదు॥ |
| నగవు లుప్పతిలితే ననుపులు సమకూడు మొగమాట గలిగితే మొనయు దమి తగులాయా లొనరితే దట్టమౌను వలపులు మగవానితో మంచిమాటలే మేలే | ॥ఎదు॥ |
| చూపులు తారసించే సొంపులు మిక్కుటమౌను కాఁపురాలు దొరకితే గట్టియౌఁ బొందు పైపై నీమీఁది బత్తిఁ బాయక నన్నేలినాఁడు చేపట్టి శ్రీవేంకటేశు సేవలే మేలే | ॥ఎదు॥ |


