శృంగార సంకీర్తన
రేకు: 1993-1
సంపుటము: 29-493
రేకు: 1993-1
సంపుటము: 29-493
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| తానే వచ్చీ నాతఁడు తడవకురే మీరు తానకమై నా కోరిక తగుల కేలుఁ(లుం?)దునే | ॥పల్లవి॥ |
| వలచిన కొలఁదినే వాడికలు సమకూడు తలఁచినకొలఁదినే తమి రేఁగును పలికినకొలఁదినే పంతములు నీడేరు కలది గలంతేకాక కడమ లే లవునే | ॥తానే॥ |
| నగినకొలఁదినే నాఁటుకొనుఁ బ్రియములు సొగిసినకొలఁదినే చుట్టరికము మొగమిచ్చుకొలఁదినే మొనయు సరసములు తగులైనకూటములు తతులేల దాఁటునే | ॥తానే॥ |
| కూడినకొలఁదినే కూరిములు కొనసాగు యీడైనకొలఁదినే ఇంపులు వుట్టు వేడుకతో న న్నిట్టె శ్రీవేంకటేశుఁ డేలినాఁడు వీడని జంటలు యెట్టు విచ్చి చెప్పవచ్చునే | ॥తానే॥ |


