శృంగార సంకీర్తన
రేకు: 1993-6
సంపుటము: 29-498
రేకు: 1993-6
సంపుటము: 29-498
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| గుట్టుతో నుండుటే మేలు కోమలులకు చుట్టపు వరుస రతిఁ జొక్కించేనయ్యా | ॥పల్లవి॥ |
| సరుసఁ గూచుండఁగాను చన్ను లొరసునో యేమో సిరులు మించఁ గొలువు సేసేనయ్యా మరలి చూడఁగానే మర్మములు సోఁకునేమో వరుసతోడుత దలవంచుక మొక్కేనయ్యా | ॥గుట్టు॥ |
| చేరి వీడె మియ్యఁగాను చెమట లంటునో యేమో వూరకే వుయ్యాలమంచ మూఁచేనయ్యా కోరి కొప్పు దువ్వఁగాను కొనగోరు దాఁకునేమో నేరుపుతోఁ గుంచెవేసి నిలుచుండేనయ్యా | ॥గుట్టు॥ |
| చేముట్టి పెనఁగఁగఁగాను చిత్తము గరఁగునేమో దోమటి దొడికి కాలు దొక్కేనయ్యా యీమేర శ్రీవేంకటేశ యిట్టె నన్ను నేలితివి నాములెక్క నిఁక నీతో నవ్వేనయ్యా | ॥గుట్టు॥ |


