శృంగార సంకీర్తన
రేకు: 1994-1
సంపుటము: 29-499
రేకు: 1994-1
సంపుటము: 29-499
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| ఆతనికి నీవు మేలు ఆతఁడు నీకు మేలు చేతులెత్తి మొక్కి ఇట్టె సేవసేయవే | ॥పల్లవి॥ |
| మనసు లెడసినాను మంచిమాఁటలె మేలు ననుచకుండినాను వినయమే మేలు పెనఁగులాడినాను ప్రేమపు నవ్వులే మేలు అనిశము పతితోడ నాఁటదానికి | ॥ఆత॥ |
| కోపము గలిగినాను కొసరుఁజూపులె మేలు తోపు నూపుడైనా సంతోసాలే మేలు రాఁపు లెక్కడైనా నూరకె వోరుచుటే మేలు చేపట్టిన పతితోడ చెలియకును | ॥ఆత॥ |
| వేవేలు నేరములైనా వేడుకతో నుంటే మేలు కావరించు యొరసినా కాఁగిలే మేలు భావించి నిన్నేలినాఁడు పట్టపుదేవులఁజేసి శ్రీవేంకటపతి మేలు చేరీ మగువ నీకు | ॥ఆత॥ |


