శృంగార సంకీర్తన
రేకు: 1994-4
సంపుటము: 29-502
రేకు: 1994-4
సంపుటము: 29-502
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| వలచిన యాఁటదాని వద్దంటే దోసముగాదా వెలలేని మన్ననల వెలయించరాదా | ॥పల్లవి॥ |
| సేసకొప్పువంచి మొక్కి చెలి యెదుట నున్నది ఆసతోఁ గాఁగిట నించి యలమరాదా రాసికెక్క ముత్యాల యారతి నీకు నెత్తీని వాసి వన్నెతోడ నాపె వద్దఁబెట్టుకోరాదా | ॥వల॥ |
| కంకణాల చేతులను కానుక నీకు నిచ్చీని అంకెలను గారవించి యందుకోరాదా సుంకుమోవ నవ్వు నవ్వి చుట్టరికాలు చూపీని పొంకముగా నాపె తోడి పొందు సేయరాదా | ॥వల॥ |
| వినయాన మోవితేనెవిందు నీకుఁ జెప్పీని చెనకుచుఁ గాఁపురాలు సేయరాదా యెనసితివి శ్రీవేంకటేశ నన్ను నింతలోనె మనిసిచ్చి యాపెతోడ మాఁటలాడరాదా | ॥వల॥ |


