శృంగార సంకీర్తన
రేకు: 1995-1
సంపుటము: 29-505
రేకు: 1995-1
సంపుటము: 29-505
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| మచ్చికతో నన్నుఁ జూచి మన్నించెఁగాక ఇచ్చకురాలనైతి ఇఁక నాకుఁ దగునే | ॥పల్లవి॥ |
| చనువుగలవారికి సాదించినాఁ దగు ననిచినవారికి జెనకఁదగును యెనసినవారికి నేమిసేసినాఁదగు ననుబోఁటివారికి నగఁదగునటవే | ॥మచ్చి॥ |
| చెలిమిగలవారికి చేరి పెనఁగఁగఁదగు బలువుగలవారికి పైకొనఁదగు కలసినవారికి కన్నుల జంకించఁదగు అలవోక మాకెల్లా నంటఁదగవటవే | ॥మచ్చి॥ |
| వేడుకగలవారికే వేగిరించినాఁదగు వాడికెగలవారికి వంతులుదగు యీడనే శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేల కూడి మావంటివారికి కొంకఁదగునటవే | ॥మచ్చి॥ |


