Display:
శృంగార సంకీర్తన
రేకు: 1995-5
సంపుటము: 29-509
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
అన్నిటా బలిమికాఁడ వౌదువు నీవు
సన్నుతించి నీకు నేము సాగిలి మొక్కేమయ్యా
॥పల్లవి॥
వింటిమి నీ సుద్దులు విరిచిన మద్దులు
బంటపంతపు చాణూరుపై గుద్దులు
గొంటిరి నీ బుద్దులు గునిసేటి ముద్దులు
ఇంటింటి వారెల్లా నివె యెంచుకొనేరయ్యా
॥అన్ని॥
చూచితి నీ చేఁతలు సుగందపు పూఁతలు
లాచి యమునలో నీ మేలుపు యీఁతలు
తాఁచి నాఁగేటి కీఁతలు తగు జాతర మేఁతలు
యే చాయఁ జూచినా సతు లెంచుకొనేరయ్యా
॥అన్ని॥
తెలిసితి నీ పొందులు తేర విదురువిందులు
నలి నుట్లు గొట్టిన గోనాల గొందులు
యెలిమి శ్రీవేంకటేశ ఇట్టె నన్ను నేలితివి
యిలలో నీ గరిమలే యెంచుకొనేరయ్యా
॥అన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము