శృంగార సంకీర్తన
రేకు: 1996-4
సంపుటము: 29-514
రేకు: 1996-4
సంపుటము: 29-514
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| కాంత సిగ్గరికత్తె గయ్యాళించ నేరదు సంతోసముతోడ నిట్టె చనవియ్యవయ్యా | ॥పల్లవి॥ |
| చెలి యానఁ వెట్టఁగాను చేతులెత్తి మొక్కఁగాను బలిమితో చన్ను లేల పట్టేవయ్యా పలుమారు వేడుఁకోఁగా పంతము లియ్యఁగాను కెలనఁ గూచుండి యెంత గిలిగించేవయ్యా | ॥కాంత॥ |
| పెనఁగులాడఁగాను ప్రియములు చెప్పఁగాను కొనగోరఁ జెక్కులేల చెనకేవయ్యా మునుకొని వొడ్డుకోఁగా మోవి లంచమయ్యఁగాను యెనగొని నిమ్మపంటనేల వేసేవయ్యా | ॥కాంత॥ |
| సారె సారె సొలయఁగా సంగడిఁ గూచుండఁగాను చేరి వుద్దండాలేల సేసేవయ్యా యీరీతి శ్రీవేంకటేశ యీకె నిన్నుఁ బెండ్లాడఁగా కోరికె లీడేరె నేమి కొలఁది వెట్టేవయ్యా | ॥కాంత॥ |


