Display:
శృంగార సంకీర్తన
రేకు: 1996-5
సంపుటము: 29-515
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
అవధారు వినవయ్యా అంగన తగవులు
జవళిఁ గూడి సతికిఁ జనవియ్యవయ్యా
॥పల్లవి॥
కాంతలకు సాజము గబ్బితనపుఁజేఁతలు
పంతాన మగఁడు యెగు పట్టఁదగదు
వింత బొమ్మజంకెనలు వేడుకకు మూలము
సంతోసాన జెలరేఁగి సమ్మతించవలెను
॥అవ॥
రట్టడ సతులకును రారాఁపులు సాజము
గుట్టుతో విభుఁడు మారుకొనదగదు
చిట్టంటుఁజెనకులు సింగారాలు మేనికి
చుట్టరికము తోడనే చొక్కి మెచ్చవలెను
॥అవ॥
చండిపెట్టుక నవ్వేది సతులకు సాజము
పెండిలికూఁతురును గుంపించఁదగదు
అండనె శ్రీవేంకటేశ యట్టె కూడితి వీకెను
మెండగు మీ వలపులు మెరయఁగవలెను
॥అవ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము