శృంగార సంకీర్తన
రేకు: 1997-5
సంపుటము: 29-521
రేకు: 1997-5
సంపుటము: 29-521
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| విచ్చి చెప్ప నెట్టు వచ్చు విరహుల గరిమలు కచ్చు పెట్టి తమ్ముఁ దామె కలయుటఁ గాక | ॥పల్లవి॥ |
| పట్టరానిది వయసు పాయరానిది కూటమి నెట్టన దాఁచరానిది నిండు వలపు గుట్టు లేనిది నగవు గురి లేనిది మనసు యెట్టు వేగించఁగ వచ్చు నిఁక విరహులకు | ॥విచ్చి॥ |
| చెప్పఁగరానిది సిగ్గు చిక్కించరానిది బుద్ది తప్పించుకోరానిది తగులాయము తిప్పరానిది గుణము తెగరానిది మమత అప్పటి నెట్టోర్వవచ్చునమ్మ విరహులకు | ॥విచ్చి॥ |
| పెంచరానిది యలుక బిగియరానిది పొందు కొంచించరానిది తలకొన్న ననుపు యెంచఁగ శ్రీవేంకటేశుఁ డీకె నిట్టె కూడెఁ గాక వంచించి యెట్టు గెలువవచ్చు విరహులకు | ॥విచ్చి॥ |


