Display:
శృంగార సంకీర్తన
రేకు: 1998-4
సంపుటము: 29-526
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
జవ్వనాలు మీ సొమ్ము సరసాలు మీ సొమ్ము
వువ్విళ్లూరే వలపులు వొడిఁగట్టుకోరయా
॥పల్లవి॥
చిలుకుఁ జూపు లాపెవి, చిమ్ముఁ జెనకులు నీవి
పలుకుఁ దేనె లాపెవి, బాసలు నీవి
యెలమి సరికి బేసి కిద్దరూ బలవంతులే
కొలఁదిలేనివలపు కూడపోసుకోరయా
॥జవ్వ॥
ప్రియము లాపెవి, సేసే పెను వినయాలు నీవి
నయము లాపెవి, కడునంటులు నీవి
నియతపు నేరుపులు నీకు నాకె కొక్కరీతే
జయమాయ వలపులు సందిఁబెట్టుకోరయా
॥జవ్వ॥
అడియాస లాపెని, ఆదరింపులు నీవి
యెడయని పొం దాపెది, యింపులు నీవి
అడరి శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
కడలేని వలపులు గంపకెత్తుకోరయా
॥జవ్వ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము