శృంగార సంకీర్తన
రేకు: 1999-2
సంపుటము: 29-530
రేకు: 1999-2
సంపుటము: 29-530
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఏఁటికి నెగ్గులు వట్టే వీపెతో నీవు మాఁటలనే లాలించి మన్నింతువుగాక | ॥పల్లవి॥ |
| ఇంతి నీతో మొగమోట మేమీ ననదాయఁగాక రంతుల దిట్టఁ జెల్లదా రచ్చలో నిన్ను చెంత నీ దేవి గనక సిగ్గువడి వుండెఁగాక యెంత నిన్ను సాదించినా యేలనేవా నీవు | ॥ఏఁటి॥ |
| ఆలి మగని వరుస నట్టె వూరకుండెఁగాక గేలిసేయ బాడి గాదా కెరలి నిన్ను మేలుది గనక నిన్ను మీరలేక మొక్కెఁగాక వాలాయించి జంకించితే వద్దనేవా నీవు | ॥ఏఁటి॥ |
| ఇచ్చక మెరిఁగి రతి నెనసి చొక్కించెఁగాక కొచ్చి సోదించుకోవద్దా కొసరి నిన్ను అచ్చపు శ్రీవేంకటేశ యలుమేలుమంగ యీకె పచ్చిగా నిన్నుఁ జేసితే పంగించేవా నీవు | ॥ఏఁటి॥ |


