శృంగార సంకీర్తన
రేకు: 1999-4
సంపుటము: 29-532
రేకు: 1999-4
సంపుటము: 29-532
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| నీకు నవ్వులైతిఁగాని నీపై బత్తి గలదాన యీకడ నీకె సుద్దు లెట్లియ్యకొందునయ్య* | ॥పల్లవి॥ |
| పల్లదాన నాపె నిన్ను పచ్చి తిట్టు తిట్టఁగాను వెల్లవిరిగా నే నెట్టు విందునయ్యా వుల్లసానఁ బాదము ని న్నూరకె తాఁకించఁగాను యెల్లవారిలోనా నే నెట్టు చూతునయ్యా | ॥నీకు॥ |
| యెదురుగా వచ్చి నీకు నెంగిలి మో వియ్యఁగాను వుదుటున నే నెట్టు వోరుతునయ్యా గుదిగొన్న వేడుకతో కొప్పువట్టి తియ్యఁగాను సదరాన నేనెట్టు సమ్మితింతునయ్యా | ॥నీకు॥ |
| పువ్వులచెండున నిన్నుఁబూఁచి యాపెవేయఁగాను వువ్విళ్లూరి నే నె ట్టూరకుందునయ్యా ఇవ్వల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిదె చివ్వన నాపె పొందెట్టు చెల్లింతునయ్యా | ॥నీకు॥ |


