శృంగార సంకీర్తన
రేకు: 2000-1
సంపుటము: 29-535
రేకు: 2000-1
సంపుటము: 29-535
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| సాకిరులేల పెట్టేవు సతివల్ల నేరమేది కాకుసేయఁ బనిలేదు కరుణించు మికఁను | ॥పల్లవి॥ |
| సుదతికిఁ బతితోడ సొలసితే నేమాయ వుదుట మీరఁగఁ దిట్టనొద్దుగాని సదరాన బొమ్మలను జంకించితే నేమాయ యెదుటనుండి యలిగి యేఁపవద్దుగాని | ॥సాకి॥ |
| కూరిములు సారె సారెఁ గొసరితే నేమాయ వారించి యానలు వెట్టవద్దుగాని బీరముతో గొంగువట్టి పెనఁగితే నేమాయ దారకాన దెరలోన దాఁగవద్దుగాని | ॥సాకి॥ |
| గుట్టుతోడఁ గాఁగిలించి కూడితే నేమాయ వట్టి నేరము లెంచఁగవద్దుగాని యిట్టె శ్రీవేంకటేశ యేలితి వీకెను నీవు చుట్టమైతే నేమాయ సోదించవద్దుగాని | ॥సాకి॥ |


