శృంగార సంకీర్తన
రేకు: 2000-2
సంపుటము: 29-536
రేకు: 2000-2
సంపుటము: 29-536
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఆపె వల్ల వెలి తించుకంతా లేదు యేపునఁ జేసే సేవ విన్నియునుఁ జేసెను | ॥పల్లవి॥ |
| సన్నలనే చూపదా సతి తా నుండేటి మేడ కన్నులనే మొక్కదా కడలనుండి విన్నవించదా వావి వేడుకతో నేకతాన కన్నెను నీ వేలుకోని కద మింతేకాక | ॥ఆపె॥ |
| తామెరల వేయదా తలఁపించి తలఁపించి మోము చూపి పొలయదా ముందర నిల్చి సాముసేసి పెనఁగదా సరసమాడే నెపాన కామించి చిత్త మెప్పుడు గరఁగీనోకాక | ॥ఆపె॥ |
| ఆకున వాసి చూపదా అట్టె తన విరహము వాకుచ్చి చెప్పదా లోలో వలపెల్లాను యీకడ శ్రీవేంకటేశ యీకె గూడితి వింతలో నీ కరుణ కిట్టానే నిలిచెనోకాకా | ॥ఆపె॥ |


