శృంగార సంకీర్తన
రేకు: 2001-1
సంపుటము: 29-541
రేకు: 2001-1
సంపుటము: 29-541
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| చెలియా రమణునికి చెప్పవే యీ సుద్దులెల్లా తలకొన్న నేరుపులు తానే నేరుచును | ॥పల్లవి॥ |
| చూపులనే మరుగని చుట్టరిక మేఁటికే రాఁపుఁగాఁ దమకించని రతు లవి యేఁటికే యేపునఁ జొక్క జేయని యెడతాఁకు లేఁటికే చాపలానఁ బెనఁగని సరసము లేఁటికే | ॥చెలి॥ |
| మనసు గరఁగనట్టి మాఁట లవి యేఁటికే చనవుమై సోఁకని సరియాఁక లేఁటికే ననుపు పెడరేఁచని నవ్వు లవి యేఁటికే తనివిఁ బొందించని తరితీపు లేఁటికే | ॥చెలి॥ |
| కలియించఁ జాలని కత లిన్నీ నేఁటికే తలఁపు నాఁటని చక్కఁదన మది యేఁటికే యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె అలరి మర్మములంటే యాఁకట మరేఁటికే | ॥చెలి॥ |


