Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 26 సంకీర్తన: 24
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 4
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
అతివె ఉపరతియను వ - ర్షాగమంబు
సతులార చూడ నా - శ్చర్యమై తోఁచెన్‌
॥పల్లవి॥
మృగనేత్రి తురుమనే - మేఘంబు గప్పుకొనె
మగువ ముఖమను చంద్ర - మండలంబు
అగణితంబైనట్టి - యలివేణి తనుకాంతి
మిగుల నలుగడ తీగ - మెఱపు లుదయించెన్‌
॥అతివె॥
కలికి గళరవమనే - గర్జనము వే బొడమె
కలయ హారములను వడ - గండ్లు రాలెన్‌
కొలఁది మీరినయట్టి - కుచగిరుల వరదలై
సొలయకటు పెంజెమట - సోన వర్షించెన్‌
॥అతివె॥
అతివె నిట్టూర్పులుప - రతుల నలయించి
సతిబొమ్మలవి యింద్ర - చాపమైయలరెన్‌
వితరణంబైన దిరు - వేంకటేశ్వరుఁ గూడ
జత గూడి యంగదే - శము జవుకు బారెన్‌
॥అతివె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము