సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 247 సంకీర్తన: 258
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 9
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 247 సంకీర్తన: 258
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 9
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్ర - అట
| అయ్యో నావెతకుగా ని - న్నలయింతుగా గయ్యాళింతుగా నిన్ను - కసరుదుగా | ॥పల్లవి॥ |
| దూరుదుగా నిన్ను చాలా - తూలనాడుదుగా పేరుగుచ్చి తిట్టుదుగా - పెరిమెబో(నాడుదు)గా కూరిమి కొసరుదుగా - కోపగింతుగా వూరకె అలుగుదుగా - వుప్పళింతుగా | ॥అయ్యో॥ |
| నెరసులరయుదుగా - నేరములెంతుగా కరకరింతుగా నిన్ను - గాసి సేతుగా నిరసింతుగా వట్టి - నిందలే గట్టుదుగా గొరబు సేతుగా నిన్ను - గుప్పింతుగా | ॥అయ్యో॥ |
| చనవు నెరపుదుగా - సారెకు పెనంగుదుగా మనసరసి చూతుగా - మారుత్తరాలిత్తుగా ఘనత యలమేల్మంగ వేం - కటేశ నిన్నునే నెనసి పాయనియ్యగా - నేమైనా సేతుగా | ॥అయ్యో॥ |


