Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 56 సంకీర్తన: 55
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 10
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: శంకరాభరణం
అయ్యో నీవెంత సేసినా - వన్నియు నేనెరుగనా
(కొ)య్యతనాలు నాతోనా - గోవిందరాజ!
॥పల్లవి॥
చాల మోము (కళలెల్లా) - సందడికొనగా మోవి
మేలి(మై)న కెంజాయలు - మించగాను
వాలుగన్ను లర - వంపుచు నెత్తురు గడు
గోలవై పవ్వళించేవు - గోవిందరాజ!
॥అయ్యో॥
(పో)పురిగొన్న నూరుపుల - బుసకొట్టుచును మేన
వరదలై పెంజెమటలు - వడియగాను
విరివిగా వాసనలు - వెదజల్లు(చు)ఁ జెదరిన
కురుల బవ్వళించేవు - గోవిందరాజ!
॥అయ్యో॥
పచ్చిసేతలతొ నీవు - బడలుచు బంగారు
పచ్చడము నిండా నా - పైఁ గప్పుచు
మచ్చు జల్లి యలమేలు - మంగను నను కౌఁగిట
గుచ్చుక పవ్వళించేవు - గోవిందరాజ!
॥అయ్యో॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము