Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 37 సంకీర్తన: 36
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 18
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి - అట
అలికి (అళులు) సంపెంగ - తావి కణఁగినట్టు
తొలఁగీ నుదుట జారి - తుమ్మెదల పిల్లలు
॥పల్లవి॥
వెలఁదియారను పాము - వెంటఁబెట్టుకొని రాఁగా
తలఁకి చంద్రుఁడు - వోయి దాఁగినట్టు
పలువన్నె మెఱుఁగుల - పయ్యదలోనె దాఁగె
చలివేఁడి మెఱుఁగుల - చందమామ పిల్లలు
॥అలికి॥
కోవిలపలుకుదాడి - కోపగించి వెంటరాఁగా
తావుల చిగురువోయి - దాఁగినట్టు
మోవి సూదివాటులై - మొనసి కానవచ్చీని
మావుల చిగురులోని - మాణికాల పిల్లలు
॥అలికి॥
భారమైన విరహతాపపు - సూరియుండు రాఁగా
తారితారి చకోరాలు - దాఁగినట్టు
కూరిమి వేంకటపతిఁ - గూడిన తమకమున
గోరగించీనిదివో చ-కోరముల పిల్లలు
॥అలికి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము