సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 14 సంకీర్తన: 11
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 19
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 14 సంకీర్తన: 11
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 19
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: కాంబోది - ఝంపె
| అలివేణి జవ్వనం - బదె యామని పొలతికి పోకకును - పుట్టెడాయ వలపు | ॥పల్లవి॥ |
| నెలత నునుచనుదోయి - నీరాడుగొంది[1], పై మెలపుతో బతిచూపు - మెఱపు మెరసె పులకపైరుల కెల్ల - ప్రోదియై చెలువారు వలి మీరు చిఱు చెమట - వాన లిక నలవే | ॥అలివేణి॥ |
| అలరి యంతంత కు - ననలు కొనలు బారి నలువొందు వయసు దా - నాముదేరి కలకంఠి చిఱుదొడలు - కఱకు పైకట్లాయె? చెలియ యిక పూవిల్తు - సీమ [2]వెలుగులుగా | ॥అలివేణి॥ |
| కులుకు నెత్తావి కుం - కుమ సుంకురాలంగ ఎలనాగ యానెడి - యెడద వేదికపై [3]అలమేలుమంగ శ్రీ వేం-కటాధీశు డెనయంగ మొలకలై నోచు నో - ములపంట పండె | ॥అలివేణి॥ |
[1] నిరాళ్లగొంది;
[2] వెరదరుగా;
[3] నా పరిశీలనమున ముద్రను బట్టి యిది పెద తిరుమలాచార్యుల రచనగా గుర్తింపబడుచున్నది. లయకొదుగకున్నా ముద్రా సంబోధనములందలి ‘శ్రీ’ కారములిట్టివి భక్త్యతిశయ ప్రకటనమునకే!


