సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 176 సంకీర్తన: 182
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 21
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 176 సంకీర్తన: 182
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 21
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: కేదార - అట
| అవునయ్యా లెస్స తగ - వాయ(బో) నేడు (బా) తవిలి తప్పొకరిది - దండన వొకరిదా | ॥పల్లవి॥ |
| దిద్ది నీ చెక్కిట గోరు - తీర్చిన వారుండగా అద్దము చూచుకొమ్మంటే - (అదె) అపరాధమా వొద్దిక నీ మోవి కెంపులుంచిన - వారుండగా అద్ది కప్పురము వెట్టుటే - (అదె) అపరాధమా | ॥అవునయ్యా॥ |
| నెరయ నీ మేన చెమట - నించినవారుండగా అరసి సురటి విసరితే - (అదె) అపరాధమా శిరిగల నీ కొప్పు - జిమ్మినవారుండగా అరుదుగ ముడుచుటే - (అదె) అపరాధమా | ॥అవునయ్యా॥ |
| యెలమి తన్నల - యించినవారుండగా అలసి వచ్చితి నంటె - (అదె) అపరాధమా అలమేలుమంగ వేంక- టప్పడవై గూడితివి అలుగకు మనంటె - (అదె) అపరాధమా | ॥అవునయ్యా॥ |


